Sunday 8 March 2015

ధ్వంసమైన స్వప్నం - అరుంధతీ రాయ్‌ - తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార, పి. వరలక్షి, కడలి.


ధ్వంసమైన స్వప్నం
- అరుంధతీ రాయ్‌  

ఒక నెత్తుటి చుక్క కూడా నేలరాలకుండా సమాజంలో విప్మవాత్మక మార్పులు తేగలిగే శక్తి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే వుంది అంటారు ఆధునిక భారత దేశ నిర్మాతల్లో ఒకరైన డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌.
అది ఆయన స్వప్నం కూడా.

భిన్నజాతులు, తెగలు, మతాలూ కులాలు, సంస్కృతులు వాటి ప్రాతిపదికన ఏర్పడ్డ అసమానతల దొంతరలతో వున్న భారతీయ సమాజానికి ప్రజాస్వామ్యం ఒక్కటే శరణ్యమని ఆయన గట్టిగా భావించారు. ఆ మేరకు ఆయన నేతృత్వంలో  రూపొందిన రాజ్యాంగంలో అనేక రక్షణలను పొందుపరిచారు. కానీ గడిచిన అరవై ఏళ్లలో మన పాలకులు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవంలేకుండా చేసారు.
ఇప్పుడు ఆ స్వప్నం ధ్వంసమై పోయింది.

ఇవాళ ప్రజలు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం నెత్తురోడి పోరాడవలసి వస్తోంది. ప్రజలకు ధర్మకర్తగా వుండవలసిన ప్రభుత్వం మీద ప్రాణాలకు తెగించి పోరాడవలసి వస్తోంది.
ఇదీ ఇప్పటి విషాదం! ... ... ...

ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గంభీరమైన చర్చలు చేసే మేధావులెవరికీ అణగారిన ప్రజల ఆకలి, ఆకాంక్షలు, అశాంతి, అణచివేత, ఆర్థిక దోపిడీ, అసమానతలు, జీవితాల విధ్వంసం ఎంతమాత్రం కనిపించక పోవడం మనం చూస్తూనే వున్నాం.

అయినప్పటికీ కొందరైనా ప్రజల పక్షాన, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న శక్తుల పక్షాన గొంతు కలుపుతున్నారు. హక్కుల పరిరక్షణ కోసం, మెరుగైన జీవితాల కోసం పోరాడుతున్న వాళ్లతో కలిసి నడుస్తున్నారు. అలా ప్రజల పక్షం వహించిన వాళ్లను భయపెట్టి, బెదిరించి చివరకు జైళ్లలో తోసి గొంతు నొక్కే ప్రయత్నాలనూ మనం గమనిస్తున్నాం.

ఇలాంటి సందర్భంలో కూడా మొక్కవోని ధైర్యంతో పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడుతోన్న అరుదైన మేధావి అరుంధతీ రాయ్‌.

ఆమె ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో పరిణామాలపై ఇంగ్లీషులో రాసిన 'చిదంబరమ్స్‌ వార్‌', 'వాకింగ్‌ విత్‌ కామ్రేడ్స్‌', 'ట్రికిల్‌డౌన్‌ రెవొల్యూషన్‌' వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ధ్వంసమైన స్వప్నం. 


ఈ మూడు వ్యాసాలు ప్రస్తుతం దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి.


ధ్వంసమైన స్వప్నం
('చిదంబర రహస్యం', 'కారడవిలో కామ్రేడ్స్‌తో', 'మానవజాతి మనుగడ కోసం విప్లవం' వ్యాసాల సంకలనం)
- అరుంధతీ రాయ్‌


ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickle down Revolution

తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార,  పి. వరలక్షి,  కడలి.

208 పేజీలు, వెల: రూ. 75/-


ప్రతులకు :
మలుపు, ఇం.నెం. 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.
ఫోన్‌ నెం. 9866559868

ఇమెయిల్‌ : malupuhyd@gmail.com

No comments:

Post a Comment