Saturday 7 March 2015

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ - అరుంధతీ రాయ్‌- తెలుగు అనువాదం: కె.సురేష్‌


పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 
- అరుంధతీ రాయ్‌

సాహిత్యంలో శ్రీశ్రీ సామ్రాజ్యవాదాన్ని మట్టి పులి అన్నాడు. దూది పులి అన్నాడు. కాటన్‌ మార్కెట్‌, షేర్‌ మార్కెట్‌ మన జీవితాలను నియంత్రించిన కాలంలో. కాని ఈ దూది పులిని నీటిలో ముంచితే ఏమీ మిగలదని తేల్చేశాడు.

గూగీ వాథియాంగో దీనిని డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌ (సిలువపై రాక్షసి) అని ఆఫ్రికా ఖండానికి ఒక చేత ఖడ్గం, మరొక చేత బైబిలూ పట్టుకొని వచ్చిన సామ్రాజ్యవాద అనుభవంతో చెప్పాడు. ... ... ...

ఇప్పుడు తాజాగా మరొక ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్‌ పెట్టుబడిదారీ విధానాన్ని ప్రేతాత్మ (క్యాపిటలిస్ట్‌ ఘోస్ట్‌) అంటున్నది.

పెట్టుబడిదారీ విధానం, దాని అత్యున్నత రూపమైన సామ్రాజ్యవాదం ఇవ్వాళ ఎంత పెనుభూతంగా విశ్వమంతా విస్తరించి భయవిహ్వలతకు గురి చేస్తున్నా మార్క్స్‌ మొదలు అరుంధతీ రాయ్‌ వరకు పోరాడే శక్తులకు ఇస్తున్న విశ్వాసం ఏమిటంటే వాటిల్లో మానవసారం లేదు. ఆత్మలేదు. అవి ప్రేతాత్మలే. ప్రేతాత్మ ఆత్మకు పర్యాయపదం కాజాలదు. మానవసారానికి పెట్టుబడి ప్రత్యామ్నాయం కాజాలదు.

ముంబై అల్టామౌంట్‌ రోడ్డులో ముఖేష్‌ అంబానీ 27 అంతస్తుల అంటిల్లా భవనంలోని ధగధగలాతే దీపకాంతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడే రాత్రిందినాలను రద్దు చేయలేవు. అవి తాత్కాలికంగా ఆ ప్రాంత ప్రజలకు రాత్రిళ్లు లేకుండా చేయగలవు. అంటే శ్రమేగాని విశ్రాంతి లేకుండా చేయగలవు. కాని అది ఎల్లకాలం ఉండబోయే సత్యం కాదు. అది ఒక ఆభాస మాత్రమే. ... ... ...

అయితే ఇవాళ ఆ ఆభాసయే ప్రపంచీకరణగా భాసిస్తున్నది. నూతన ఆర్థిక విధానం పేరుతో, అభివృద్ధి పేరుతో, పెరిగిన వృద్ధి రేటు పేరుతో ఇవి మనముందు ఒక మాయాజాలాన్ని పరచి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజా వంచనకు పాల్పడుతున్నది.

భూదాహంతో, వనర్ల దాహంతో, ప్రత్యేక ఆర్థిక మండలాలు, గనుల తవ్వకాలు, పవర్‌ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాలు, సముద్రతీర పారిశ్రామిక , పర్యాటక కారిడార్లు వంటి పేర్లతో మనుషుల కాళ్లకింద నేల మిగలకుండాచేసి చాప చుట్టగా చుట్టి బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా అర్పిస్తున్న దళారీ స్వభావం గురించి అరుంధతీ రాయ్‌ ఈ పుస్తకంలో సాధికారికంగా, ప్రామాణికంగా వివరాలతో, విశ్లేషణతో మన కళ్లకు కడుతున్నది.

(వరవరరావు రాసిన ముందుమాట ఆత్మావలోకనం నుంచి)

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 

- అరుంధతీ రాయ్‌

తెలుగు అనువాదం: కె.సురేష్‌

44 పేజీలు, వెల: రూ.25/-

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com




No comments:

Post a Comment