Wednesday 4 March 2015

భారత్‌పై అరుణతార - అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు- యాన్‌ మిర్డాల్‌ రచన - అనువాదం: ఎన్‌.వేణుగోపాల్‌

భారత్‌పై అరుణతార 
- అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు- యాన్‌ మిర్డాల్‌ రచన - అనువాదం: ఎన్‌.వేణుగోపాల్‌

ఇది చైనాపై అరుణతార వంటి చరిత్రాత్మక రచన. డెబ్బై ఐదు సంవత్సరాల కింద చైనా విప్లవ సైన్యంతో నాలుగు నెలల పాటు కలిసి నడిచి, నాయకులతో విస్తారంగా సంభాషణలు జరిపి అమెరికన్‌ జర్నలిస్టు ఎడ్గార్‌ స్నో రాసిన ''చైనాపై అరుణతార'' చైనా విప్లవోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విప్లవానికి అంతర్జాతీయ సంఘీభావం సంపాదించడంలో గణనీయైన పాత్ర నిర్వహించింది.

ఆ పుస్తకం ప్రేరణగా స్వీడిష్‌ రచయిత యాన్‌ మిర్డాల్‌ రెండు వారాలపాడు దండకారణ్యంలో భారత ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంతో గడిపి, అగ్రనాయకులతో సంభాషించి ''భారత్‌పై అరుణతార'' రాశారు. ఏడు దశాబ్దాలకు పైబడిన తన చారిత్రక, రాజకీయ, సామాజిక అవగాహనల నేపథ్యంతో ఎప్పటికప్పుడు దండకారణ్య అనుభవాలను పోల్చి చూస్తూ ప్రతి క్షణం గతానికీ వర్తమానానికీ భవిష్యత్తుకూ నిరంతర వారధి నిర్మిస్తూ ఈ రచన సాగింది.

భారత్‌పై అరుణతార దండకారణ్యంలో విస్తరిస్తున్న ఆశాజ్యోతి గురించి మాత్రమే కాదు, పారిస్‌ కమ్యూన్‌ నుంచి జనతన సర్కార్‌ దాకా సాగుతున్న ప్రజా ప్రత్యామ్నాయ ప్రయత్నాలనూ, ప్రజా అభివృద్ది నమూనానూ, ప్రజా రాజ్యాధికార భావనలనూ, ప్రజా సంస్కృతీ వికాసాన్నీ విశ్లేషిస్తుంది. భారత కమ్యూనిస్టు ఉద్యమ జయాపజయాలనూ, భారత సామాజిక వాస్తవికతలనూ మననం చేసుకుంటూ భారత్‌పై ఉజ్వలంగా ప్రకాశించనున్న అరుణతార వెలుగులను పాఠకులకు చూపడానికి ప్రయత్నిస్తుంది.



భారత్‌పై అరుణతార 
అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు


యాన్‌ మిర్డాల్‌ 
అనువాదం: ఎన్‌.వేణుగోపాల్‌

200 పేజీలు, వెల రూ.100/-



ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం

ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com




No comments:

Post a Comment