Sunday 29 March 2015

అన్నా హజారేది ఏ ప్రజల గొంతుక ?

అన్నా హజారే గాంధేయ వాదినని చెప్పుకుంటాడు.
కానీ అతను ప్రతిపాదిస్తున్న జన లోకపాల్ బిల్లు గాంధేయవాదానికి వ్యతిరేకమైనది.
అయినా రేయింబవళ్ళూ సాగిన కార్పోరేట్ మీడియా ప్రచారం
అతడిని 'ప్రజల గొంతుక' గా పేర్కొంది.
అమెరికాలో " వాల్ స్ట్రీట్  ముట్టడి " ఉద్యమంలా కాకుండా
హజారే నడుపుతున్న ఉద్యమం ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తి, ఆర్ధిక " సంస్కరణలకు " వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనలేదు.
హజారేకు మద్దతు తెలిపిన కార్పోరేట్ మీడియా
అతిపెద్ద కార్పోరేట్ అవినీతి కుంభకోణాలు బయటపడినప్పుడు
(పెద్ద పెద్ద విలేఖరుల గుట్టు కూడా రట్టు అయ్యింది)
వాటినుంచి ప్రజల దృష్టిని మళ్ళించ డానికేప్రయత్నించింది.

రాజకీయ నాయకుల పట్ల ప్రజాగ్రహాన్ని సాకుగా చేసుకుని
ప్రభుత్వ అధికారాలను మరింత నీరు కార్చాలని, మరిన్ని సంస్కరణలు చేపట్టాలని, ప్రైవేటీకరణను వేగవంతం చెయ్యాలని ప్రచారం సాగించింది.
(2008 లో అన్నా హజారేకి విశిష్ట ప్రజాసేవకి గాను ప్రపంచ బ్యాంకు అవార్డు లభించింది).
అయన చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం
తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని
వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటన కూడా ఇచ్చింది.

అరుంధతీ రాయ్ (పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ)
...

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 
- అరుంధతీ రాయ్‌

తెలుగు అనువాదం: కె.సురేష్‌

44 పేజీలు, వెల: రూ.25/-

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

Tuesday 24 March 2015

ధ్వంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా ?

ధ్వంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా ?

భారత ప్రజలు
వలస పాలన దుర్మార్గం లేని, పరాయి పాలన లేని, అసమానతలు లేని, అందరికీ సమానావకాశాలు ఉండే గణతంత్రాన్నినిర్మించుకోవాలని కలగన్నారు.
ఆ స్వప్నం నిజం చేసుకోడానికి దశాబ్దాల పాటు వీరోచిత పోరాటం సాగించారు.
చివరికి వలసవాదులు వెళ్లిపోయారని భ్రమపడి,
భారత ప్రజలమైన మాకు మేము ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక, సామ్యవాద గణతంత్రాన్ని
ఇచ్చుకుంటున్నాము అని రాజ్యంగా రచన చేసుకున్నారు.
కానీ ఆ భ్రమ త్వరలోనే తేలిపోయింది.
ఆ స్వంప్నం భగ్నమైపోయింది.
మన గణతంత్రానికి సర్వసత్తాక అధికారం లేదు.
సామ్యవాదం లేదు.
అసలిది గణతంత్రమే కాదు.
ప్రజల రాజ్యమే కాదు.
దేశ దేశాల దోపిడీ దొంగల రాజ్యం ... ... ...
... ...   
ధ్వంసమైన స్వప్నం
('చిదంబర రహస్యం', 'కారడవిలో కామ్రేడ్స్‌తో', 'మానవజాతి మనుగడ కోసం విప్లవం' వ్యాసాల సంకలనం)
- అరుంధతీ రాయ్‌

ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickle down Revolution
తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార,  పి. వరలక్షి,  కడలి.
208 పేజీలు, వెల: రూ. 75/-
ప్రతులకు :
మలుపు, ఇం.నెం. 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.
ఫోన్‌ నెం. 9866559868
ఇమెయిల్‌ : malupuhyd@gmail.com


Wednesday 18 March 2015

Capitalism : A Ghost Story by Arundhati Roy


Capitalism : A Ghost Story
by
Arundhati Roy



Capitalism’s real “grave-diggers” may end up being its own
delusional Cardinals, who have turned ideology into faith.

Despite their strategic brilliance, they seem to have trouble grasping a simple fact: Capitalism is destroying the planet.

The two old tricks that dug it out of past crises—War and Shopping—simply will not work.


... As night fell over Mumbai, guards in crisp linen shirts
with crackling walkie-talkies appeared outside the forbidding gates of Antilla.

The lights blazed on, to scare away the ghosts perhaps.


The neighbours complain that Antilla’s bright lights have stolen
the night. 


Perhaps it’s time for us to take back the night.


Capitalism : A Ghost Story
by
Arundhati Roy


44 Pages ;  Price : Rs.50/-

Friday 13 March 2015

"కాస్ట్ కాన్సర్ "- శేఖర్ కార్టూన్లు


"కాస్ట్ కాన్సర్ "- శేఖర్ కార్టూన్లు

" అనారోగ్య బాధితున్నే అయితేనేం యోధుణ్నే" అన్న చెరబండరాజు లాగా 
తన శరీరం లోని కాన్సర్ తో పోరాడుతూనే
మన సమాజానికి  సోకిన "కాస్ట్ కాన్సర్" పై చివరి క్షణం వరకూ
కుంచె కత్తిని ఝలిపించిన యోధుడు కార్టూనిస్ట్ శేఖర్.

నవ్వు పుట్టించేందుకు ఎందరో కార్టూనిస్టులు నానా తంటాలు పడుతుంటారు.
ఆ క్రమంలో ఒకోసారి మానవ విలువల్ని,
సమాజం పట్ల తమ బాధ్యతల్ని కూడా బలిపెడుతుంటారు.

కానీ శేఖర్ ఆ కోవకు చెందినవాడు కాదు.
పైగా అందుకు వ్యతిరేకం.
తను నమ్ముకున్న సిద్ధాంతాలను, విలువలను పోగొట్టుకోకుండా చివరివరకూ కృషి చేసినవాడు.

కులం మీద కార్టూన్లు వేయాలను కోవడమే ఒక సాహసం.
అనుకోవడమే కాదు ... ఒకపక్క అనారోగ్యంతో ఎడతెరిపిలేకుండా పోరాడుతూనే తన లక్ష్యాన్ని
సాధించడం నిజంగా అపూర్వం.
నితర సాధ్యం.
కార్తూనిస్టులూ, కళాభిమానులూ, సామాజిక కార్యకర్తలూ అందరూ గర్వించదగ్గ విషయం.

ఈ సూర్యాపేట సూర్యుడి సంఘ సంస్కరణాభిలాషకూ, చిత్రకళా ప్రతిభకూ
దర్పణం పడుతుంది "కులం  క్యాన్సర్ " పై  ప్రయోగించిన  ఈ పంచరంగుల కార్టూన్ల విస్ఫోటనం .

Caste Cancer
Multi Colour Cartoons
by Shekhar 

 
A4 Size, 64 Pages Cost: Rs.175/-

 

Thursday 12 March 2015

పరాయి పాలనను ఎదిరించిన ఝాన్సీ, రచన: మహాశ్వేతాదేవి, అనువాదం: రివేరా, కృష్ణకాంత్‌

పరాయి పాలనను ఎదిరించిన 
ఝాన్సీ 
- మహాశ్వేతాదేవి

ఝాన్సీ లక్ష్మీబాయి జీవించి, పోరాడిన రోజులు గడిచిపోయి నూటాయాభై సంవత్సరాలయింది. ఆమె ఏ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిందో, ఆ పోరాట ఫలితంగానే ఏడాది తిరక్కుండానే ఆ ఈస్టిండియా కంపెనీ పోయి స్వయంగా బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన మొదలయింది. ఆ పాలన కూడా ముగిసి నల్లదొరలకు అధికార మార్పిడి జరిగి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ పుస్తక రచన జరిగి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి.

ఇన్ని మార్పులు జరిగినా, కాలం చాలా ముందుకు జరిగినా, ఆ పోరాటానికీ, ఈ పుస్తకానికీ ప్రాసంగికత, ప్రాధాన్యత, అవసరం తగ్గిపోలేదు సరికదా, రోజురోజుకూ పెరుగుతున్నాయి. 


విభిన్న రూపాలలో కొనసాగుతున్న పరాయి పాలనను , దోపిడీ పీడనలను ఎదిరిస్తూ వీరోచితమైన, త్యాగభరితమైన, ఆశావహమైన ప్రజాపోరాటాలు ఇవాళ కూడా సాగుతున్నాయి. 

అందుకే ఇవాళ్టికీ ఝాన్సీ లక్ష్మీభాయి  పోరాటం గురించీ, ఆ పోరాట జ్ఞాపకాల గురించీ ఆలోచించవలసిన, తలచుకోవాల్సిన విషయాలు మిగిలే వున్నాయి.



పరాయి పాలనను ఎదిరించిన
ఝాన్సీ

రచన: మహాశ్వేతాదేవి,

అనువాదం: రివేరా, కృష్ణకాంత్‌
258 పేజీలు, వెల: రూ.150/-

ప్రచురణ: మలుపు బుక్స్‌ , హైదరాబాద్‌

ప్రతులకు : మలుపు, ఇం.నెం. 2-1-1/ 5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500044
ఫోన్‌ నెం. 09866559868
ఇ మెయిల్‌ :  malupuhyd@gmail.com

మానవ మృగాలు చెలరేగిన నేల ''ఖైర్లాంజి'' ఒక చేదుపాట - ఆనంద్‌ తెల్‌తుంబ్డె, తెలుగు అనువాదం : ప్రశాంత్‌, ప్రభాకర్‌ మందార


మానవ మృగాలు చెలరేగిన నేల 
ఖైర్లాంజి
ఒక చేదుపాట

స్వాతంత్య్రానంతర కాలంలో దళితులపై హంతక దాడులు జరిగిన కీలవేన్మణి, బెల్చీ, మోరిల్‌ జాన్‌పే, కారంచేడు, చుండూరు, మేళవలుపు, కంబాలపల్లి, జజ్జర్‌ మొదలైన దారుణ సంఘటనలకు కొనసాగింపే ఖైర్లాంజీ.

2006 సెప్టెంబర్‌ 29 నాడు మహారాష్ట్ర, మెహది తాలూకాలోని ఖైర్లాంజీ అనే మారుమూల గ్రామంలో సురేఖా భోట్‌మాంగే అనే మహిళనూ, ఆమె కూతురైన ప్రియాంకా భోట్‌మాంగేనూ వివస్త్రల్ని చేసి, నగ్నంగా ఊరేగించి, సామూహికంగా అత్యాచారం జరిపి హత్య చేశారు.
వారితోపాటు వారి కుమారులు రోషన్‌, సుధీర్‌లను కూడా దారుణంగా కొట్టి చంపారు.
ఈ పాపంలో గ్రామస్తులంతా పాలుపంచుకున్నారు.
తరువాత ఆ నాలుగు శవాలనూ తీసుకెళ్లి పక్కనే వున్న కాలువలో పడేశారు.
భోట్‌మాంగేలు దళిత కులానికి చెందినవాళ్లు.

జనం అప్పుడే వాళ్లని మరిచిపోయారు.
ప్రతిరోజూ సగటున ఇద్దరు దళితులు ఈవిధంగా హత్యకు గురయ్యే ఈ దేశంలో ఇదో మామూలు విషయమైపోయింది. స్వాతంత్య్రానంతరం మన దేశంలో జరిగిన కులపరమైన అత్యాచారాల్లోకెల్లా అత్యంత దారుణమైన ఖైర్లాంజీ సంఘటనను ఆనంద్‌ తెల్‌తుంబ్డె ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. మన చుట్టూ ఖైర్లాంజీలు పదేపదే ఏవిధంగా జరుగుతున్నాయో, ఎందుకు పునరావృతమవుతున్నాయో వివరించారు.

21వ శతాబ్దపు స్వతంత్ర భారతదేశంలో ఒక దళిత కుటుంబాన్ని బహిరంగంగా, సంప్రదాయికంగా ఊచకోతకోసిన సంఘటనపై ఆనంద్‌ తెల్‌తుంబ్డే చేసిన ఈ విశ్లేషణతో మన సమాజం ఎంత కుళ్లిపోయిందో అర్థమవుతుంది.

ఈ ఊచకోత వెనకవున్న కారణాలనూ, ఇలాంటి కిరాతకాలు జరగడానికి దోహదం చేస్తున్న సామాజిక, రాజకీయ అంశాలనూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార ప్రసార మాధ్యమాలు అన్నింటినీ ఎండగడుతుంది. సమాజంలో పశుప్రవృత్తి పెరగడానికి, ఆ తరువాత వాటిని కప్పిపుచ్చడానికి అవన్నీ ఎలా తోడ్పడుతున్నాయో వివరిస్తుంది.

భూస్వామ్య వ్యవస్థ అవశేషాలనో, అంతిమదినాలనో అభివర్ణించే పుస్తకం కాదిది.
భారతదేశంలో ఆధునికత అంటే అర్థమేమిటో తెలియజెప్పే పుస్తకం.
సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా చర్చించిన పుస్తకం.



మానవ మృగాలు చెలరేగిన నేల
ఖైర్లాంజి
ఒక చేదుపాట
- ఆనంద్‌ తెల్‌తుంబ్డె


ఆంగ్లమూలం: Khairlanji - A Strange and Bitter Crop, by Anand Teltumbde, 2008, Navayana, New Delhi.


తెలుగు అనువాదం : ప్రశాంత్‌, ప్రభాకర్‌ మందార

ముఖచిత్రం : రమణజీవి

168 పేజీలు, వెల: రూ. 100/-


ప్రచురణ: మలుపు బుక్స్‌ , హైదరాబాద్‌
ప్రతులకు : మలుపు, ఇం.నెం. 2-1-1/ 5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500044
ఫోన్‌ నెం. 9866 5598 68
ఇ మెయిల్‌ :  malupuhyd@gmail.com



Tuesday 10 March 2015

జంగల్ నామా రచన: సత్నామ్ , తెలుగు అనువాదం : కొణతం దిలీప్



జంగల్ నామా
మావోయిస్టు గెరిల్లా జోన్ లో అనుభవాలు 


జంగల్ నామా అడవులపై రాసిన పరిశోధనాత్మక పుస్తకం కాదు.
అలా అని కాల్పనిక సాహిత్యమూ కాదు.
రచయితా సత్నామ్ బస్తర్ అడవుల్లో పర్యటించి అక్కడ స్వయంగా చూసిన కమ్యూనిస్టు గెరిల్లాల, ఆదివాసుల జీవన విధానాలను వివరించే పుస్తకం .


నమ్మిన సిద్దాంతాల కొరకు జీవితాలను తృణప్రాయంగా అర్పించే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ పుస్తకం చదివితే అర్ధం అవుతుంది.

జంగల్ నామా
మావోయిస్టు గెరిల్లా జోన్ లో అనుభవాలు
- సత్నామ్

తెలుగు అనువాదం : కొణతం దిలీప్ 

 
148 పేజీలు , వెల : రూ. 100 /-

ప్రచురణ: 

మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం

ప్రతులకు: 

మలుపు, ఇం నెం. 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఫోన్‌: 0 986655 9868
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

Sunday 8 March 2015

ఇవన్నీ బాగుకేనా ??

ఇవన్నీ బాగుకేనా?
మలుపు ప్రచురించిన "విధ్వంసక అభివృద్ది ఆరు దశాబ్దాల పాలనా విధానాలు" పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజ్ లో వచ్చిన భాగం :
(నమస్తే తెలంగాణ 09-03-2015 కు కృతజ్ఞతలతో )


ధ్వంసమైన స్వప్నం - అరుంధతీ రాయ్‌ - తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార, పి. వరలక్షి, కడలి.


ధ్వంసమైన స్వప్నం
- అరుంధతీ రాయ్‌  

ఒక నెత్తుటి చుక్క కూడా నేలరాలకుండా సమాజంలో విప్మవాత్మక మార్పులు తేగలిగే శక్తి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే వుంది అంటారు ఆధునిక భారత దేశ నిర్మాతల్లో ఒకరైన డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌.
అది ఆయన స్వప్నం కూడా.

భిన్నజాతులు, తెగలు, మతాలూ కులాలు, సంస్కృతులు వాటి ప్రాతిపదికన ఏర్పడ్డ అసమానతల దొంతరలతో వున్న భారతీయ సమాజానికి ప్రజాస్వామ్యం ఒక్కటే శరణ్యమని ఆయన గట్టిగా భావించారు. ఆ మేరకు ఆయన నేతృత్వంలో  రూపొందిన రాజ్యాంగంలో అనేక రక్షణలను పొందుపరిచారు. కానీ గడిచిన అరవై ఏళ్లలో మన పాలకులు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవంలేకుండా చేసారు.
ఇప్పుడు ఆ స్వప్నం ధ్వంసమై పోయింది.

ఇవాళ ప్రజలు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం నెత్తురోడి పోరాడవలసి వస్తోంది. ప్రజలకు ధర్మకర్తగా వుండవలసిన ప్రభుత్వం మీద ప్రాణాలకు తెగించి పోరాడవలసి వస్తోంది.
ఇదీ ఇప్పటి విషాదం! ... ... ...

ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గంభీరమైన చర్చలు చేసే మేధావులెవరికీ అణగారిన ప్రజల ఆకలి, ఆకాంక్షలు, అశాంతి, అణచివేత, ఆర్థిక దోపిడీ, అసమానతలు, జీవితాల విధ్వంసం ఎంతమాత్రం కనిపించక పోవడం మనం చూస్తూనే వున్నాం.

అయినప్పటికీ కొందరైనా ప్రజల పక్షాన, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న శక్తుల పక్షాన గొంతు కలుపుతున్నారు. హక్కుల పరిరక్షణ కోసం, మెరుగైన జీవితాల కోసం పోరాడుతున్న వాళ్లతో కలిసి నడుస్తున్నారు. అలా ప్రజల పక్షం వహించిన వాళ్లను భయపెట్టి, బెదిరించి చివరకు జైళ్లలో తోసి గొంతు నొక్కే ప్రయత్నాలనూ మనం గమనిస్తున్నాం.

ఇలాంటి సందర్భంలో కూడా మొక్కవోని ధైర్యంతో పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడుతోన్న అరుదైన మేధావి అరుంధతీ రాయ్‌.

ఆమె ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో పరిణామాలపై ఇంగ్లీషులో రాసిన 'చిదంబరమ్స్‌ వార్‌', 'వాకింగ్‌ విత్‌ కామ్రేడ్స్‌', 'ట్రికిల్‌డౌన్‌ రెవొల్యూషన్‌' వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ధ్వంసమైన స్వప్నం. 


ఈ మూడు వ్యాసాలు ప్రస్తుతం దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి.


ధ్వంసమైన స్వప్నం
('చిదంబర రహస్యం', 'కారడవిలో కామ్రేడ్స్‌తో', 'మానవజాతి మనుగడ కోసం విప్లవం' వ్యాసాల సంకలనం)
- అరుంధతీ రాయ్‌


ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickle down Revolution

తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార,  పి. వరలక్షి,  కడలి.

208 పేజీలు, వెల: రూ. 75/-


ప్రతులకు :
మలుపు, ఇం.నెం. 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.
ఫోన్‌ నెం. 9866559868

ఇమెయిల్‌ : malupuhyd@gmail.com

Saturday 7 March 2015

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ - అరుంధతీ రాయ్‌- తెలుగు అనువాదం: కె.సురేష్‌


పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 
- అరుంధతీ రాయ్‌

సాహిత్యంలో శ్రీశ్రీ సామ్రాజ్యవాదాన్ని మట్టి పులి అన్నాడు. దూది పులి అన్నాడు. కాటన్‌ మార్కెట్‌, షేర్‌ మార్కెట్‌ మన జీవితాలను నియంత్రించిన కాలంలో. కాని ఈ దూది పులిని నీటిలో ముంచితే ఏమీ మిగలదని తేల్చేశాడు.

గూగీ వాథియాంగో దీనిని డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌ (సిలువపై రాక్షసి) అని ఆఫ్రికా ఖండానికి ఒక చేత ఖడ్గం, మరొక చేత బైబిలూ పట్టుకొని వచ్చిన సామ్రాజ్యవాద అనుభవంతో చెప్పాడు. ... ... ...

ఇప్పుడు తాజాగా మరొక ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్‌ పెట్టుబడిదారీ విధానాన్ని ప్రేతాత్మ (క్యాపిటలిస్ట్‌ ఘోస్ట్‌) అంటున్నది.

పెట్టుబడిదారీ విధానం, దాని అత్యున్నత రూపమైన సామ్రాజ్యవాదం ఇవ్వాళ ఎంత పెనుభూతంగా విశ్వమంతా విస్తరించి భయవిహ్వలతకు గురి చేస్తున్నా మార్క్స్‌ మొదలు అరుంధతీ రాయ్‌ వరకు పోరాడే శక్తులకు ఇస్తున్న విశ్వాసం ఏమిటంటే వాటిల్లో మానవసారం లేదు. ఆత్మలేదు. అవి ప్రేతాత్మలే. ప్రేతాత్మ ఆత్మకు పర్యాయపదం కాజాలదు. మానవసారానికి పెట్టుబడి ప్రత్యామ్నాయం కాజాలదు.

ముంబై అల్టామౌంట్‌ రోడ్డులో ముఖేష్‌ అంబానీ 27 అంతస్తుల అంటిల్లా భవనంలోని ధగధగలాతే దీపకాంతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడే రాత్రిందినాలను రద్దు చేయలేవు. అవి తాత్కాలికంగా ఆ ప్రాంత ప్రజలకు రాత్రిళ్లు లేకుండా చేయగలవు. అంటే శ్రమేగాని విశ్రాంతి లేకుండా చేయగలవు. కాని అది ఎల్లకాలం ఉండబోయే సత్యం కాదు. అది ఒక ఆభాస మాత్రమే. ... ... ...

అయితే ఇవాళ ఆ ఆభాసయే ప్రపంచీకరణగా భాసిస్తున్నది. నూతన ఆర్థిక విధానం పేరుతో, అభివృద్ధి పేరుతో, పెరిగిన వృద్ధి రేటు పేరుతో ఇవి మనముందు ఒక మాయాజాలాన్ని పరచి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజా వంచనకు పాల్పడుతున్నది.

భూదాహంతో, వనర్ల దాహంతో, ప్రత్యేక ఆర్థిక మండలాలు, గనుల తవ్వకాలు, పవర్‌ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారాలు, సముద్రతీర పారిశ్రామిక , పర్యాటక కారిడార్లు వంటి పేర్లతో మనుషుల కాళ్లకింద నేల మిగలకుండాచేసి చాప చుట్టగా చుట్టి బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా అర్పిస్తున్న దళారీ స్వభావం గురించి అరుంధతీ రాయ్‌ ఈ పుస్తకంలో సాధికారికంగా, ప్రామాణికంగా వివరాలతో, విశ్లేషణతో మన కళ్లకు కడుతున్నది.

(వరవరరావు రాసిన ముందుమాట ఆత్మావలోకనం నుంచి)

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 

- అరుంధతీ రాయ్‌

తెలుగు అనువాదం: కె.సురేష్‌

44 పేజీలు, వెల: రూ.25/-

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com




Friday 6 March 2015

సల్వాజుడుం - జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, జస్టిస్‌ సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌ - అనువాదం: డా. మాడభూషి శ్రీధర్‌

రాజ్య దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకం: 'సల్వాజుడుం'

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.సుదర్శన్‌ రెడ్డి, సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌ ల చారిత్రాత్మక తీర్పు

అనువాదం: మాడభూషి శ్రీధర్‌

కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఆర్థిక వనరులతో, ప్రోత్సాహంతో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ లేదా 'సల్వాజుడుం' వగైరా పనుల ద్వారా రాజ్యం చూపిన ప్రతిస్పందన ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైనదో, ఎంత అప్రజాస్వామిక స్వభావం కలిగినదో జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, జస్టిస్‌ సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌లు తమ తీర్పులో ఉద్వేగపూరితంగా, లోతుగా వివరించారు.

'అభివృద్ధి తీవ్రవాదం' గురించీ,
'వనరులే శాపంగా మారడం' గురించీ,
'వాషింగ్టన్‌ సమ్మతి' గురించీ,
విధానాల విధ్వంసకర ఫలితాల గురించీ ఈ తీర్పు సరిగ్గా వ్యాఖ్యానించింది.

ఈ తీర్పు సాహసికమైనది.
వినూత్నమైనది.
ఈ తీర్పు ఈ సందర్భానికి తగిన ఎన్నో రాజ్యాంగ, చట్టపరమైన అంశాల మీద అత్యంత మేధోపూర్వకమైన విశ్లేషణ.

ఆదివాసులు, సమాజంలోని ఇతర పీడిత వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలను గురించి, హింస - ప్రతిహింసల గురించీ, అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యమే చట్ట ఉల్లంఘన చేస్తే ఫలితం ఏమవుతుందనే దాని గురించీ న్యాయశాస్త్ర గ్రంథాలు వెతికితే ఈ తీర్పుతో సమానమైన తీర్పు మరొకటి కనబడదు.

రాజ్య దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకం:  "సల్వాజుడుం"

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.సుదర్శన్‌ రెడ్డి, సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌ల చారిత్రాత్మక తీర్పు

అనువాదం: మాడభూషి శ్రీధర్‌

72 పేజీలు, వెల: రూ.40/-

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ : 
malupuhyd@gmail.com

Thursday 5 March 2015

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి - బషారత్‌ పీర్‌, అనువాదం: యార్లగడ్డ నిర్మల

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

ఆరు దశాబ్దాలుగా నిత్య సంక్షోభంలో మునిగి వున్న కశ్మీర్‌ ప్రజల దుర్భర జీవన గాథ ఇది.

జీవన్మరణ పోరాటాల కథ ఇది.

దారుణ నిర్బంధకాండ కళ్లకు కట్టినట్టు చిత్రించిన రచన ఇది.

ఇటు భారత ప్రభుత్వ సైనిక బలగాల దౌర్జన్యాలకూ, అటు పాకిస్థాన్‌ ప్రేరిత మిలిటెంట్‌ సంస్థల దుర్మార్గాలకూ మధ్య కశ్మీర్‌ ప్రజల స్వయం నిర్ణయాదికార ఆకాంక్ష ఎట్లా అణగిపోతున్నదో ఎన్నెన్నో జీవితాలతో నిరూపించి చూపిన కథనం ఇది.

అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ, ప్రపంచ స్థాయిలో, ఇరుదేశాల ద్వైపాక్షిక స్థాయిలో ఎంత చర్చ జరిగినప్పటికీ, తమను ఆ చర్చల్లో ఎన్నడూ భాగం చెయ్యని పాలకవర్గ దుర్మార్గం మీద కశ్మీరీ ప్రజల్లో రగుతున్న నిప్పు నిషిద్ధ రాత్రులను ఎలా వెలిగిస్తున్నదో చూపిన కథనం ఇది.

సాధారణ జీవితం కోల్పోయిన లక్షలాది మంది ప్రజల ఆవేదనకు అక్షర రూపం ఇది.

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

- బషారత్‌ పీర్‌

అనువాదం: యార్లగడ్డ నిర్మల


148 పేజీలు, వెల :రూ.150/-


ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇ మెయిల్: malupuhyd@gmail.com

Wednesday 4 March 2015

భారత్‌పై అరుణతార - అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు- యాన్‌ మిర్డాల్‌ రచన - అనువాదం: ఎన్‌.వేణుగోపాల్‌

భారత్‌పై అరుణతార 
- అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు- యాన్‌ మిర్డాల్‌ రచన - అనువాదం: ఎన్‌.వేణుగోపాల్‌

ఇది చైనాపై అరుణతార వంటి చరిత్రాత్మక రచన. డెబ్బై ఐదు సంవత్సరాల కింద చైనా విప్లవ సైన్యంతో నాలుగు నెలల పాటు కలిసి నడిచి, నాయకులతో విస్తారంగా సంభాషణలు జరిపి అమెరికన్‌ జర్నలిస్టు ఎడ్గార్‌ స్నో రాసిన ''చైనాపై అరుణతార'' చైనా విప్లవోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విప్లవానికి అంతర్జాతీయ సంఘీభావం సంపాదించడంలో గణనీయైన పాత్ర నిర్వహించింది.

ఆ పుస్తకం ప్రేరణగా స్వీడిష్‌ రచయిత యాన్‌ మిర్డాల్‌ రెండు వారాలపాడు దండకారణ్యంలో భారత ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంతో గడిపి, అగ్రనాయకులతో సంభాషించి ''భారత్‌పై అరుణతార'' రాశారు. ఏడు దశాబ్దాలకు పైబడిన తన చారిత్రక, రాజకీయ, సామాజిక అవగాహనల నేపథ్యంతో ఎప్పటికప్పుడు దండకారణ్య అనుభవాలను పోల్చి చూస్తూ ప్రతి క్షణం గతానికీ వర్తమానానికీ భవిష్యత్తుకూ నిరంతర వారధి నిర్మిస్తూ ఈ రచన సాగింది.

భారత్‌పై అరుణతార దండకారణ్యంలో విస్తరిస్తున్న ఆశాజ్యోతి గురించి మాత్రమే కాదు, పారిస్‌ కమ్యూన్‌ నుంచి జనతన సర్కార్‌ దాకా సాగుతున్న ప్రజా ప్రత్యామ్నాయ ప్రయత్నాలనూ, ప్రజా అభివృద్ది నమూనానూ, ప్రజా రాజ్యాధికార భావనలనూ, ప్రజా సంస్కృతీ వికాసాన్నీ విశ్లేషిస్తుంది. భారత కమ్యూనిస్టు ఉద్యమ జయాపజయాలనూ, భారత సామాజిక వాస్తవికతలనూ మననం చేసుకుంటూ భారత్‌పై ఉజ్వలంగా ప్రకాశించనున్న అరుణతార వెలుగులను పాఠకులకు చూపడానికి ప్రయత్నిస్తుంది.



భారత్‌పై అరుణతార 
అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు


యాన్‌ మిర్డాల్‌ 
అనువాదం: ఎన్‌.వేణుగోపాల్‌

200 పేజీలు, వెల రూ.100/-



ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం

ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com




తెలంగాణ జైత్రయాత్ర - ఘంటా చక్రపాణి

తెలంగాణ జైత్రయాత్ర 
- ఘంటా చక్రపాణి 

మలివిడత తెలంగాణ ఉద్యమంతో కలిసి అడుగులు వేసిన ఘంటా చక్రపాణి కలం నుండి వెలువడ్డ ఘంటాపథం ఏక కాలంలో పరిశీలక మార్గదర్శక పాత్రలు పోషించిందని చెప్పొచ్చు. ఉద్యమానికి ఇదొక  దాక్యుమెంటేషన్ లాగా నిలుస్తుంది.ప్రతివారం జరిగే సంఘటనల్ని నిశిత దృష్టితో పరిశీలించి వ్యాఖ్యానించడం లక్ష్యంగా మొదలైనా ఎప్పటికప్పుడు తనదైన 
శైలిలో సూచనలు కూడా చేయడం ఘంటా పథం ప్రత్యేకత ఉద్యమం ఆటుపోట్లన్నిటినిఇందులో మనం చూడవచ్చు. ఉత్సాహ నైరాశ్యాలన్నిటికీ స్పందనలు ఇందులో కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని నిర్వచించే ప్రయత్నం కూడా చేసింది ఘంటాపథం.

తెలంగాణ జైత్రయాత్ర 
- ఘంటా చక్రపాణి 
పేజీలు : 328,  వెల: రూ. 200/-

ప్రచురణ: 
మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం ఫోన్‌: 09866559868

ప్రతులకు: 
2-1-1/5, 
నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

Tuesday 3 March 2015

భారతదేశంలో కుల సమస్య రచన : అనురాధ గాంధి; తెలుగు అనువాదం : కె. సురేష్

భారతదేశంలో కుల సమస్య


భారతదేశంలో కులాలు ఒక ఆందోళన కలిగించే వాస్తవం. అయితే కొందరు అవి ఎన్నటికీ పోవని భావిస్తే, మరికొందరు అదొక సమస్యేకాదని అసలు పట్టించుకోరు. తత్ఫలితంగా కులాలు లక్షలాది ప్రజల జీవితాలను సంక్షోభానికి గురిచేస్తూ, పాలకవర్గాల అధికార పునాదులను బలోపేతం చేస్తూ  కొనసాగుతున్నాయి. కుల నిర్మూలనపై దృష్టిని కేంద్రీకరిస్తే వాటిని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కామ్రెడ్‌ అనురాధా గాంధీ రాసిన 'భారతదేశంలో కుల సమస్య' వ్యాసం ఈ కోవలోకే వస్తుంది.

ఈ వ్యాసానికి ప్రాధాన్యత ఇది ప్రాచీన కాలంలోని కులాల మూలాలు మొదలుకుని వర్తమాన కాలంలో కుల నిర్మూలనా కార్యక్రమాల వరకూ సమగ్రంగా విశ్లేషించినందువల్ల మాత్రమే కాదు - దళితులూ ఆదివాసీలతో విప్లవ జీవితాన్ని గడిపిన కామ్రెడ్‌ అనురాధా గాంధీ భారత ప్రజాస్వామిక విప్లవంలో కులాలకు కీలకపాత్ర వుందని గ్రహించి, కుల సమస్యపై విప్లవకారులకు ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాయడం వల్ల లభించింది.

భారతదేశంలో కుల సమస్య
- అనురాధ గాంధి


ఆంగ్ల మూలం: Scripting of Change (Caste Question Chapter) by Anuradha Ghandy

తెలుగు అనువాదం : కె. సురేష్ 


ముందుమాట:  ఆనంద్ తెల్ తుంబ్డె 
అనువాదం: ప్రభాకర్ మందార 


ముఖచిత్రం : రమణజీవి 

156 పేజీలు  , వెల : రూ. 120 /-

ISBN 978-93-85076-00-8

ప్రతులకు  :
మలుపు,
2-1-1/5, నల్లకుంట
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం- 500044


ఇ మెయిల్: malupuhyd@gmail.com


.

విధ్వంసక అభివృద్ధి ఆరు దశాబ్దాల పాలనా విధానాలు అనువాదం : ఎ. రాజేంద్రబాబు

విధ్వంసక అభివృద్ధి
ఆరు దశాబ్దాల పాలనా విధానాలు
అనువాదం : ఎ. రాజేంద్రబాబు


ఆనకట్టలు ... గనులు ... కార్ఖానాలు ... అడవి జంతువుల అభయారణ్యాలు ... ప్రజలు ... గ్యాస్‌ గొట్టపు బావులు ... ప్రత్యేక ఆర్థిక మండళ్లు ...
ఈ జాబితాలో అన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచేది ఏది?
అని ప్రశ్నిస్తే చిన్న పిల్లవాడైనా ఠక్కున సమాధానం చెప్తాడు-

 ''ప్రజలు'' అని!

ఎందుకని అడిగితే మిగతావన్నీ ''ప్రజల'' బాగు కోసం వున్నాయి కదా అని సమాధానం వస్తుంది. డిగ్రీలో ఆర్థిక శాస్త్రం చదువుకొంటున్న విద్యార్థి అయినా, ఈ దేశ ఆర్థికశాఖ మంత్రి అయినా ఇదే సమాధానం చెప్తారు!

అందరూ నమ్మతున్న ఈ సాధారణ విషయాన్ని ప్రశ్నించడమే, సవాలు చేయడమే ఈ పుస్తక లక్ష్యం!

నిజంగా ఇవన్నీ ప్రజల మంచికోసమేనా?

....

గత ఆరు దశాబ్దాలుగా భారతదేశంలో దళారీ పాలకులు సాధిస్తున్న ''విధ్వంసక అభివృద్ధి'' గురించి, ప్రజా సమూహాల స్థానభ్రంశం గురించి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొంత మంది విద్యార్థులు, అధ్యాపకులు విస్తృతంగా చేసిన అధ్యయన నివేదిక తెలుగు అనువాదమే ఈ పుస్తకం.



విధ్వంసక అభివృద్ధి
ఆరు దశాబ్దాల పాలనా విధానాలు
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థుల, అధ్యాపకుల అధ్యయన నివేదిక

మూలం: Abondoned - Development & Displacement by Perspectives, New Delhi
అనువాదం : ఎ. రాజేంద్రబాబు
ముఖచిత్రం: రమణజీవి

254 పేజీలు, వెల: రూ.170/-

ISBN 978-81-925474-9-


ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం ఫోన్‌: 09866559868

ప్రతులకు: 
2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com






Monday 2 March 2015

తెలుగు ప్రచురణ రంగంలో మేలి "మలుపు"



తెలుగు సమాజంలో వచ్చిన ఒక మలుపునకు అక్షర రూపం ...
తెలుగు సాహిత్యంలో వికసించిన ఒక మలుపునకు ఎత్తిపట్టిన అద్దం ...
ఈ "మలుపు" 





తెలుగు సమాజ గమనం గత రెండు మూడు దశాబ్దాలుగా పెద్ద కుదుపులకు లోనయింది.
అప్పటికే సాగుతున్న విప్లవోద్యమంతో పాటు -
ఆదివాసి, దళిత, బహుజన ఆత్మ గౌరవ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమాలు
తెలుగు సమాజం తనను తాను చూసుకునే పద్ధతినే మార్చివేశాయి.

ఆ కుదుపులు సామాజిక ఉద్యమాలలోనూ, సాహిత్య ఉద్యమాలలోనూ, సాహిత్యంలోనూ విస్తృతంగా ప్రతిఫలించాయి. భావజాల ప్రపంచంలో కొట్టవచ్చినట్టు కనిపించే మలుపులు తలెత్తాయి. మన ఆలోచనా పథం మీద వికసించిన ఆ మలుపులు మన దృక్పథాన్ని విశాలం చేశాయి.

అయితే కొత్త మలుపుల మంచినీ చెడునూ గుణాలనూ దోషాలనూ విశిష్టతలనూ లోపాలనూ సమన్వయ దృష్టితో, నిష్పాక్షికంగా అంచనా కట్టే వాతావరణం తరిగిపోతూ వచ్చింది.
ఆయా సామాజిక వర్గాల ఉద్యమాలు సాధించిన విజయాలను, వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తూనే వాటి గమనంలో జాగ్రత్త వహించాల్సిన అంశాలను కూడా చర్చించవలసి వుంది.
అంటే 'మలుపు'లోని ఘనతను అంగీకరిస్తూనే, ఆ మలుపు సరయిన దిశలో వెళ్తున్నదో లేదో విమర్శనాత్మకంగా పరిశీలించవలసి ఉన్నది.
ఈ అవగాహనతో సామాజిక ఉద్యమాల గురించి విశ్లేషణలను, ముఖ్యంగా కుల, మహిళా, ఆదివాసీ, ప్రాంతీయ సమస్యల గురించి విశ్లేషణలను విస్తృతంగా ప్రచారం చేయడం కొరకు ప్రారంభించబడిన ప్రత్యేక ప్రచురణ సంస్థే ఈ 'మలుపు'

మలుపును ఆహ్వానించండి.
మలుపు పుస్తకాలను ఆదరించండి.
మలుపు ప్రచురణలకు మీ వంతు చేయూత నివ్వండి. 


ఈ మలుపు అందరిదీ
అందులో కొందరు ...

ప్రొ.ఘంటా చక్రపాణి , ఎం. వేదకుమార్, కాత్యాయని, సుధా, కొణతం దిలీప్, కందాడి బాల్ రెడ్డి  


Malupu, 
H.No.2-1-1/5, 
Nallakunta, 
Hyderabad - 500044.

 Phone : 9866559868
email : malupuhyd@gmail.com 

.