Monday 2 March 2015

తెలుగు ప్రచురణ రంగంలో మేలి "మలుపు"



తెలుగు సమాజంలో వచ్చిన ఒక మలుపునకు అక్షర రూపం ...
తెలుగు సాహిత్యంలో వికసించిన ఒక మలుపునకు ఎత్తిపట్టిన అద్దం ...
ఈ "మలుపు" 





తెలుగు సమాజ గమనం గత రెండు మూడు దశాబ్దాలుగా పెద్ద కుదుపులకు లోనయింది.
అప్పటికే సాగుతున్న విప్లవోద్యమంతో పాటు -
ఆదివాసి, దళిత, బహుజన ఆత్మ గౌరవ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమాలు
తెలుగు సమాజం తనను తాను చూసుకునే పద్ధతినే మార్చివేశాయి.

ఆ కుదుపులు సామాజిక ఉద్యమాలలోనూ, సాహిత్య ఉద్యమాలలోనూ, సాహిత్యంలోనూ విస్తృతంగా ప్రతిఫలించాయి. భావజాల ప్రపంచంలో కొట్టవచ్చినట్టు కనిపించే మలుపులు తలెత్తాయి. మన ఆలోచనా పథం మీద వికసించిన ఆ మలుపులు మన దృక్పథాన్ని విశాలం చేశాయి.

అయితే కొత్త మలుపుల మంచినీ చెడునూ గుణాలనూ దోషాలనూ విశిష్టతలనూ లోపాలనూ సమన్వయ దృష్టితో, నిష్పాక్షికంగా అంచనా కట్టే వాతావరణం తరిగిపోతూ వచ్చింది.
ఆయా సామాజిక వర్గాల ఉద్యమాలు సాధించిన విజయాలను, వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తూనే వాటి గమనంలో జాగ్రత్త వహించాల్సిన అంశాలను కూడా చర్చించవలసి వుంది.
అంటే 'మలుపు'లోని ఘనతను అంగీకరిస్తూనే, ఆ మలుపు సరయిన దిశలో వెళ్తున్నదో లేదో విమర్శనాత్మకంగా పరిశీలించవలసి ఉన్నది.
ఈ అవగాహనతో సామాజిక ఉద్యమాల గురించి విశ్లేషణలను, ముఖ్యంగా కుల, మహిళా, ఆదివాసీ, ప్రాంతీయ సమస్యల గురించి విశ్లేషణలను విస్తృతంగా ప్రచారం చేయడం కొరకు ప్రారంభించబడిన ప్రత్యేక ప్రచురణ సంస్థే ఈ 'మలుపు'

మలుపును ఆహ్వానించండి.
మలుపు పుస్తకాలను ఆదరించండి.
మలుపు ప్రచురణలకు మీ వంతు చేయూత నివ్వండి. 


ఈ మలుపు అందరిదీ
అందులో కొందరు ...

ప్రొ.ఘంటా చక్రపాణి , ఎం. వేదకుమార్, కాత్యాయని, సుధా, కొణతం దిలీప్, కందాడి బాల్ రెడ్డి  


Malupu, 
H.No.2-1-1/5, 
Nallakunta, 
Hyderabad - 500044.

 Phone : 9866559868
email : malupuhyd@gmail.com 

.
 
 

No comments:

Post a Comment