Friday, 12 June 2015

Sunday, 7 June 2015

సంకెళ్ళ సవ్వడి - ఆంద్ర జ్యోతి వివిధ


ఇవాళ్టి నమస్తే తెలంగాణా లో బి. అనురాధ గారి ముందు మాట


నమస్తే తెలంగాణ  8 జూన్ 2015సౌజన్యంతో 

Arun Ferreira's "Colours Of The Cage" in Telugu

Arun Ferreira's "Colours Of The Cage" in Telugu
as SAMKELLA SAVVADI
Translated by N. Venugopal
Book Release Function on 13 June 2015 Saturday at 5.30 PM
At Sarasvata Parishat (SP) Hall, Boggula Kunta, Ramkoti, Hyderabad
Presided over by : Bojja Tarakam
Chief Guest : Justice B. Sudarshan Reddy
Speakers:
Prof. Haragopal,
Arun Ferreira,
Seema Ajad,
N. Venugopal,
K. Srinivas

All are invited



Saturday, 6 June 2015

పంజరపు రంగుల కథ

సాంకేతికంగా మాత్రమే ఇది అనువాద పుస్తకం.
సారాంశంలో అచ్చ తెలుగు పుస్తకం.
(సాక్షి 7-6 - 2015 సౌజన్యంతో)




Thursday, 4 June 2015

సంకెళ్ళ సవ్వడి పుస్తకావిష్కరణ సభ


సంకెళ్ళ సవ్వడి
పుస్తకావిష్కరణ సభ

13 జూన్ 2015, శనివారం
సాయంత్రం 5-30 గంటలకు

సారస్వత పరిషత్ (ఎస్ పీ) హాల్ ,
బొగ్గులకుంట, హైదరాబాద్


సభాధ్యక్షులు : బొజ్జా తారకం
ముఖ్య అతిధి : జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

ఉపన్యాసకులు :
ప్రొ. హరగోపాల్
పుస్తక రచయిత : అరుణ్ ఫరేరా
దస్తక్ సంపాదకులు : సీమా ఆజాద్
పుస్తక అనువాదకులు :  ఎన్ . వేణుగోపాల్
ఆంధ్ర జ్యోతి సంపాదకులు : కే. శ్రీనివాస్ 


అందరికీ ఇదే మా ఆహ్వానం
- మలుపు 



Sunday, 31 May 2015

ఈ దేశానికి ఇలాంటి మరెన్నో పుస్తకాల ఆవశ్యకత వుంది - అరుంధతీ రాయ్


అరుణ్ ఫరేరా రచన 'కలర్స్ ఆఫ్ కేజ్' ను
"ఒక 'మావోయిస్ట్' ఖైదీ జైలు అనుభవాలు - సంకెళ్ళ సవ్వడి" పేరుతో తెలుగులో ప్రచురిస్తున్నాం.
వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ అనువాదం చేసారు.
జూన్ 13 న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు.

"కలర్స్ ఆఫ్ కేజ్" పుస్తకం పై గతంలో వచ్చిన సమీక్షల్లోంచి కొన్ని భాగాలు:

"అరుణ్‌ ఫెరీరా కస్టోడియల్‌ హింస గురించి, తప్పుడు కేసులతో ఏళ్లకేళ్లు చెరసాలలో నిర్బంధించడం గురించి, న్యాయ శాస్త్ర నియమాల దారుణ ఉల్లంఘన గురించి ఎంతో విస్పష్టంగా, నిష్కర్షగా మనకు వివరిస్తున్నారు. లక్షలాది మంది తోటి పౌరులు, మహిళలు ఆయన అనుభవాలలో భాగస్వాములే. అయితే వారిలో అనేక మందికి న్యాయవాదులు లేదా న్యాయ సహాయం అందుబాటులో లేదు. ఈ దేశానికి  ఇలాంటి మరెన్నో పుస్తకాల ఆవశ్యకత వుంది."
.............................................................................................................  - అరుంధతి రాయ్‌
"ఈ పుస్తకం సీదా సాదా, సంభాషణ శైలిలో ఉంటుంది. ఈ జ్ఞాపికలను అన్యాయపూరిత, క్రూర, నిరాశాపూరిత పరిస్త్తితులలో నమోదు చేసారు. వాటితో పోలిస్తే కథనం లోని సచిత్ర వివరణ, ఆశావహ దృక్పధం అద్భుతంగా అనిపిస్తాయి."
............................................................................................................    - ఫ్రంట్ లైన్
"ఫరేరాది చాలా బాధాపూరితమైన గాధ. దానిని అతడు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నాడు. సాంప్రదాయ విజ్ఞతతో తగువుపడకుండానే ప్రతిదానినీ నిజాయితీతో, శ్రద్ధతో పరికిస్తాడు. భారంగా అనిపిమ్చాకుండానే కథనంలో చాలా వివరాలు ఉన్నాయి."
.............................................................................................................    - ద ట్రిబ్యూన్
"స్వాతంత్ర్యానికి ముందునాటి నియమాలతో నడుస్తున్న భారతీయ జైళ్ళ చిత్రాన్ని అతడి పుస్తకం ఆవిష్కరిస్తుంది. "
...................................................................................................       - ద ఇండియన్ ఎక్స్ ప్రెస్
"... మాటలకందని వ్యధని, అన్యాయాన్ని ఎదుర్కొన్న అసాధారణ మానవ ఓరిమినితెలియజేసే గుండెలు పిండే కధనం. దేశన్యాయ, శిక్షా వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసి నిష్పాక్షికంగా, అన్నిటినీ చీల్చి చూపే కధనం. "
...................................................................................................          - ద హిందూ
"21వ శతాబ్దంలో భారత దేశంలోని ఘటనలను వివరించే చిన్నపాటి ద గులాగ్ ఆర్చిపిలాగో లాగా ఫరేరా పుస్తకం అనిపిస్తుంది. మంచి శాస్త్ర కారుడిలాగాఅన్నింటినీ వెల్లడి చేసే ఈ పుస్తకాన్ని అన్ని కళాశాలల్లో తప్పనిసరి పటనంగా చెయ్యాలి .."
................................................................................................................    - ద సండే గార్డియన్
"... ప్రశాంతత చెదరని కధకుడు ఫరేరా. జైలు గోడల లోపలి వ్యంగ్యం తో మీలో మీరు నవ్వుకునేలా చేస్తాడు."
...............................................................................................................      - హిందుస్థాన్ టైమ్స్
" మేరీ టేలర్ 'భారత దేశం లో నా జైలు జీవితం ' తరువాత భారతీయ జైళ్ళు, న్యాయ వ్యవస్థ పై అత్యుత్తమ పుస్తకాల్లో ఇది ఒకటి ..."
....................................................................................................................      - ఫస్ట్ పోస్ట్



వివరాలకు:
మలుపు
2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్ - 500044

malupuhyd@gmail.com
ISBN : 978-93-85076-01-5



Wednesday, 27 May 2015

అరుణ్ ఫరేరా 'కలర్స్ ఆఫ్ ది కేజ్' ... 'సంకెళ్ళ సవ్వడి' గా త్వరలో తెలుగులో !

'మావోయిస్ట్ ఖైదీ'గా ఐదేళ్ళ తన జైలు జీవితానుభవాలను వివరిస్తూ
అరుణ్ ఫరేరా రాసిన "కలర్స్ ఆఫ్ ది కేజ్" ను "సంకెళ్ళ సవ్వడి" పేరుతో మలుపు తెలుగులో  ప్రచురిస్తోంది.
జూన్ 13, 2015 న హైదరాబాద్ లో పుస్తకావిష్కరణ సభ వుంటుంది.
పూర్తి వివరాలు త్వరలో.


Tuesday, 5 May 2015

ఇది అభివృద్ది ఎందుకు కాదంటే ...

ఇది అభివృద్ది ఎందుకు కాదంటే ...

ఇప్పుడు చర్చంతా అభివృద్ది గురించే.
పాలకులు మాట్లాడినా,
పరిశ్రమలు మాట్లాడినా,
ప్రజలు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు.
అయితే అందరి మాటలూ ఒకటి కాదు.
ఉద్దేశాలు ఒకటి కాదు.
లక్ష్యాలు అంతకంటే ఒకటి కాదు.
......
విధ్వంసక అభివృద్ది ఆరు దశాబ్దాల పాలనా విధానాలు పుస్తకం పై ఆదివారం ఆంధ్రజ్యోతి (3-5-2015) లో
కే. అనురాధ గారి సమీక్ష : 

Sunday, 29 March 2015

అన్నా హజారేది ఏ ప్రజల గొంతుక ?

అన్నా హజారే గాంధేయ వాదినని చెప్పుకుంటాడు.
కానీ అతను ప్రతిపాదిస్తున్న జన లోకపాల్ బిల్లు గాంధేయవాదానికి వ్యతిరేకమైనది.
అయినా రేయింబవళ్ళూ సాగిన కార్పోరేట్ మీడియా ప్రచారం
అతడిని 'ప్రజల గొంతుక' గా పేర్కొంది.
అమెరికాలో " వాల్ స్ట్రీట్  ముట్టడి " ఉద్యమంలా కాకుండా
హజారే నడుపుతున్న ఉద్యమం ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తి, ఆర్ధిక " సంస్కరణలకు " వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనలేదు.
హజారేకు మద్దతు తెలిపిన కార్పోరేట్ మీడియా
అతిపెద్ద కార్పోరేట్ అవినీతి కుంభకోణాలు బయటపడినప్పుడు
(పెద్ద పెద్ద విలేఖరుల గుట్టు కూడా రట్టు అయ్యింది)
వాటినుంచి ప్రజల దృష్టిని మళ్ళించ డానికేప్రయత్నించింది.

రాజకీయ నాయకుల పట్ల ప్రజాగ్రహాన్ని సాకుగా చేసుకుని
ప్రభుత్వ అధికారాలను మరింత నీరు కార్చాలని, మరిన్ని సంస్కరణలు చేపట్టాలని, ప్రైవేటీకరణను వేగవంతం చెయ్యాలని ప్రచారం సాగించింది.
(2008 లో అన్నా హజారేకి విశిష్ట ప్రజాసేవకి గాను ప్రపంచ బ్యాంకు అవార్డు లభించింది).
అయన చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం
తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని
వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటన కూడా ఇచ్చింది.

అరుంధతీ రాయ్ (పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ)
...

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 
- అరుంధతీ రాయ్‌

తెలుగు అనువాదం: కె.సురేష్‌

44 పేజీలు, వెల: రూ.25/-

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com