Sunday 22 October 2017

దళిత మహిళ తొలి ఆత్మకథ - ఆదివారం ఆంద్ర జ్యోతిలో (22-10-2017) చందు తులసి సమీక్ష

దళిత మహిళ తొలి ఆత్మకథ

వర్ణ వ్యవస్థ సృష్టించిన అత్యంత హేయమైన దురాచారం అంటరానితనం కారణంగా తరతరాల పాటు దళితుల జీవితాలు అంధకారంలో మగ్గిపోయాయి.
ఆధునిక విద్య,దళిత ఉద్యమాలు తీసుకొచ్చిన చైతన్యంతో ఆ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఇప్పటికీ పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతంగా దళిత సాహిత్యాన్ని తీసుకొస్తున్నారు. బాబా అంబేద్కర్ నడిపిన దళిత ఉద్యమంలో తోలి తరం మహిళా కార్యకర్త బేబీ కాంబ్లీ.

ఆమె తన జీవిత కాలంలో మహారాష్ట్రలోని మహర్ల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తూ రాసిన నవల ఇది. జీవా అమూచ అనే పేరుతొ  మరాఠీ పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ  ఆత్మకథ ...  దళిత మహిళ కోణంలోంచి వివరిస్తుంది. తరతరాలుగా దాస్యం,  వేట్టిచాకిరిలో మగ్గిపోయిన మహార్లు ... పేదరికంలో అంత కన్నా రదృష్టకరమైన అంతరానితనంతో దుర్భరంగా జీవించిన వారు, అంబేద్కర్ అందించిన చైతన్యంతో ఉద్యమాలు చేసి ఆత్మగౌరవాన్ని సాధించడమే సంక్షిప్తంగా ఈ నవల సందేశం.
అటు అగ్ర వర్ణ దురహంకారంతో పాటూ, ఇటు దళిత సమాజంలోనూ మహిళలపై హింస, అణచివేత, పురుషాధిక్య భావజాలం, వివక్ష ... పేరుకుపోయిన తీరును కాంబ్లీ అత్యంత సహజంగా చిత్రించారు. అ రకంగా దీన్ని దళిత మహిళ దృక్కోణం లోంచి వచ్చిన మొదటి ఆత్మకథగా చెప్పుకోవచ్చు. ఒక సాధారణ దళిత మహిళ జీవితం ఆత్మకథగా రావడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. మరాఠా పత్రికలో వచ్చిన ఈ రచన తెలుగు లోకి రావడానికి నలభై ఏళ్ళు పట్టడం గమనార్హం .

- చందు తులసి
ఆదివారం ఆంధ్రజ్యోతి



Monday 2 October 2017

ఈ పుస్తకం చదువుతుంటే మనకు తెలియని మన చరిత్ర పేరిట తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహిళల అనుభవాలను గ్రంధస్థం చేసిన వైన గుర్తుకు వస్తుంది - కే.పీ అశోక్ కుమార్, నవ తెలంగాణా

ఈ పుస్తకం చదువుతుంటే
'మనకు తెలియని మన చరిత్ర' పేరిట తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహిళల అనుభవాలను
గ్రంధస్థం చేసిన వైన గుర్తుకు వస్తుంది
- కే.పీ అశోక్ కుమార్, నవ తెలంగాణా 02-10-2017