Sunday, 31 May 2015

ఈ దేశానికి ఇలాంటి మరెన్నో పుస్తకాల ఆవశ్యకత వుంది - అరుంధతీ రాయ్


అరుణ్ ఫరేరా రచన 'కలర్స్ ఆఫ్ కేజ్' ను
"ఒక 'మావోయిస్ట్' ఖైదీ జైలు అనుభవాలు - సంకెళ్ళ సవ్వడి" పేరుతో తెలుగులో ప్రచురిస్తున్నాం.
వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ అనువాదం చేసారు.
జూన్ 13 న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు.

"కలర్స్ ఆఫ్ కేజ్" పుస్తకం పై గతంలో వచ్చిన సమీక్షల్లోంచి కొన్ని భాగాలు:

"అరుణ్‌ ఫెరీరా కస్టోడియల్‌ హింస గురించి, తప్పుడు కేసులతో ఏళ్లకేళ్లు చెరసాలలో నిర్బంధించడం గురించి, న్యాయ శాస్త్ర నియమాల దారుణ ఉల్లంఘన గురించి ఎంతో విస్పష్టంగా, నిష్కర్షగా మనకు వివరిస్తున్నారు. లక్షలాది మంది తోటి పౌరులు, మహిళలు ఆయన అనుభవాలలో భాగస్వాములే. అయితే వారిలో అనేక మందికి న్యాయవాదులు లేదా న్యాయ సహాయం అందుబాటులో లేదు. ఈ దేశానికి  ఇలాంటి మరెన్నో పుస్తకాల ఆవశ్యకత వుంది."
.............................................................................................................  - అరుంధతి రాయ్‌
"ఈ పుస్తకం సీదా సాదా, సంభాషణ శైలిలో ఉంటుంది. ఈ జ్ఞాపికలను అన్యాయపూరిత, క్రూర, నిరాశాపూరిత పరిస్త్తితులలో నమోదు చేసారు. వాటితో పోలిస్తే కథనం లోని సచిత్ర వివరణ, ఆశావహ దృక్పధం అద్భుతంగా అనిపిస్తాయి."
............................................................................................................    - ఫ్రంట్ లైన్
"ఫరేరాది చాలా బాధాపూరితమైన గాధ. దానిని అతడు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నాడు. సాంప్రదాయ విజ్ఞతతో తగువుపడకుండానే ప్రతిదానినీ నిజాయితీతో, శ్రద్ధతో పరికిస్తాడు. భారంగా అనిపిమ్చాకుండానే కథనంలో చాలా వివరాలు ఉన్నాయి."
.............................................................................................................    - ద ట్రిబ్యూన్
"స్వాతంత్ర్యానికి ముందునాటి నియమాలతో నడుస్తున్న భారతీయ జైళ్ళ చిత్రాన్ని అతడి పుస్తకం ఆవిష్కరిస్తుంది. "
...................................................................................................       - ద ఇండియన్ ఎక్స్ ప్రెస్
"... మాటలకందని వ్యధని, అన్యాయాన్ని ఎదుర్కొన్న అసాధారణ మానవ ఓరిమినితెలియజేసే గుండెలు పిండే కధనం. దేశన్యాయ, శిక్షా వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసి నిష్పాక్షికంగా, అన్నిటినీ చీల్చి చూపే కధనం. "
...................................................................................................          - ద హిందూ
"21వ శతాబ్దంలో భారత దేశంలోని ఘటనలను వివరించే చిన్నపాటి ద గులాగ్ ఆర్చిపిలాగో లాగా ఫరేరా పుస్తకం అనిపిస్తుంది. మంచి శాస్త్ర కారుడిలాగాఅన్నింటినీ వెల్లడి చేసే ఈ పుస్తకాన్ని అన్ని కళాశాలల్లో తప్పనిసరి పటనంగా చెయ్యాలి .."
................................................................................................................    - ద సండే గార్డియన్
"... ప్రశాంతత చెదరని కధకుడు ఫరేరా. జైలు గోడల లోపలి వ్యంగ్యం తో మీలో మీరు నవ్వుకునేలా చేస్తాడు."
...............................................................................................................      - హిందుస్థాన్ టైమ్స్
" మేరీ టేలర్ 'భారత దేశం లో నా జైలు జీవితం ' తరువాత భారతీయ జైళ్ళు, న్యాయ వ్యవస్థ పై అత్యుత్తమ పుస్తకాల్లో ఇది ఒకటి ..."
....................................................................................................................      - ఫస్ట్ పోస్ట్వివరాలకు:
మలుపు
2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్ - 500044

malupuhyd@gmail.com
ISBN : 978-93-85076-01-5No comments:

Post a comment