Monday 19 February 2018

గుగి వా థియాంగొ "యుద్ధకాలంలో స్వప్నాలు- బాల్య జ్ఞాపకాలు" పుస్తకావిష్కరణ సభ విశేషాలు

ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో 
ప్రఖ్యాత కెన్యా రచయిత గుగి వా థియాంగొ అభిమాన పాఠకులు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య 
ఆయన రచించిన Dreams in a time of war తెలుగు అనువాదం "యుద్ధకాలంలో స్వప్నాలు- బాల్య జ్ఞాపకాలు" (అనువాదం ప్రొ. జి. ఎన్. సాయిబాబా)  పుస్తకావిష్కరణ సభ అత్యంత స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా జరిగింది. 

సభకు సంబంధించిన పత్రికా వార్తల కత్తిరింపులు, ఫోటోలు, యూ ట్యూబ్ వీడియోలు కొన్ని 
దిగువ పొందుపరుస్తున్నాము. 
ఆయా పత్రికా రచయితలకు, వీడియో  గ్రాఫర్లకు, ఫోటో గ్రాఫర్లకు ప్రత్యేకించి కందుకూరి రమేష్ బాబుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు :






ఈనాడు 

















 యూ ట్యూబ్ వీడియోలు:

1)  N.Venugopal Speech at Dreams in a time of war book telugu version release function:

https://www.youtube.com/watch?v=IemqLkzaJSw&feature=youtu.be


2) Suji Taru speech :

https://www.youtube.com/watch?v=bxBGSYcke8E


3) Ngugi wa thiongo's speech :

https://www.youtube.com/watch?v=QxGLFK2kEGQ



Friday 9 February 2018

కెన్యా రచయిత గుగి వా థియాంగో స్వయంగా పాల్గొంటున్న యుద్ధకాలంలో స్వప్నాలు- బాల్య జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ సభ ఫిబ్రవరి 18న సాయంత్రం 5-30 కి తెలుగు విశ్వవిద్యాలయంలో

కెన్యా రచయిత గుగి వా థియాంగో స్వయంగా పాల్గొంటున్న
యుద్ధకాలంలో స్వప్నాలు- బాల్య జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ సభ
ఫిబ్రవరి 18న సాయంత్రం 5-30 కి
తెలుగు విశ్వవిద్యాలయంలో

ప్రొ. జి.ఎన్. సాయిబాబా
నాగపూర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ గా వున్నప్పుడు
Dreams in a Time of War - A Childhood Memoir అన్న ఈ పుస్తకాన్ని
తెలుగులోకి అనువదించారు.


Sunday 24 December 2017

భవిష్యత్ ను సృష్టించే స్వప్నం - యుద్ధ కాలంలో స్వప్నాలు బాల్య జ్ఞాపకాలు (Dreams in a Time of War) - నమస్తే తెలంగాణ 25 12 2017

భవిష్యత్ ను సృష్టించే స్వప్నం -
యుద్ధ కాలంలో స్వప్నాలు (Dreams in a Time of War) తెలుగు ప్రచురణకు  గుగి  రాసిన ముందు మాట



మొదటి ప్రచురణ : మే, 2016

యుద్ధకాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు

గూగీ వా తియాంగో
మూలం : డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - చైల్డ్‌హుడ్‌ మెమరీస్‌
అనువాదం : ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా

వెల : రూ. 200/-
ప్రచురణ : మలుపు, హైదరాబాద్‌.
ప్రతులకు: 
2-1-1/5, 
నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com




To: జి.ఎన్. సాయిబాబా From: గుగి వా థియాంగో - యుద్ధ కాలంలో స్వప్నాలు బాల్య జ్ఞాపకాలు - ఆంధ్ర జ్యోతి 25 12 -2017

To: జి.ఎన్. సాయిబాబా From: గుగి వా థియాంగో
- యుద్ధ కాలంలో స్వప్నాలు (Dreams in a Time of War) తెలుగు ప్రచురణకు  గుగి  రాసిన ముందు మాట




మొదటి ప్రచురణ : మే, 2016


యుద్ధకాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు
గూగీ వా తియాంగో
మూలం : డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - చైల్డ్‌హుడ్‌ మెమరీస్‌
అనువాదం : ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా

వెల : రూ. 200/-
ప్రతులకు: 
2-1-1/5, 
నల్లకుంట, హైదరాబాద్‌-500044

ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com






Saturday 4 November 2017

కెన్యా జైల్లో శిక్ష అనుభవిస్తూ గూగీ రచిస్తే - నాగపూర్ జైల్లో అండర్‌ ట్రయల్‌గా ఉన్నప్పుడు ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా తెలుగు లోకి అనువదించారు ! యుద్ధ కాలంలో స్వప్నాలు పుస్తకం వెలువడింది !





కెన్యా జైల్లో శిక్ష అనుభవిస్తూ గూగీ  రచిస్తే  - నాగపూర్ జైల్లో  అండర్‌ ట్రయల్‌గా ఉన్నప్పుడు  ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా  తెలుగు లోకి అనువదించారు ! యుద్ధ కాలంలో స్వప్నాలు పుస్తకం వెలువడింది !

యుద్ధకాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు
ఇంగ్లీష్  మూలం : డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - చైల్డ్‌హుడ్‌ మెమరీస్‌
రచన : గూగీ వా తియాంగో
తెలుగు అనువాదం :  ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా
వెల : రూ. 200/-
ప్రచురణ : మలుపు, హైదరాబాద్‌.

త్వరలో ఈ పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ లో నిర్వహించ బడుతుంది. ఈలోగా పుస్తకాలు కావలసిన వారు  మలుపు  బుక్స్ ద్వారా పొందవచ్చు.

తొంభై శాతం అంగ వైకల్యం వున్న ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా ప్రస్తుతం నాగపూర్‌  జైలులో  దుర్భరమైన స్థితిలో జీవిత ఖైదు శిక్ష ను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. మానవతా దృష్టితో ఆయన శిక్షను రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని దేశ వ్యాప్తంగా మేధావులు, కవులు రచయితలూ , సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి మనమూ సంఘీభావం ప్రకటిద్దాం.

గూగీ వా తియాంగో  ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా దిల్లీలో వున్నప్పుడు స్వయంగా కలుసుకున్నారు. ఈ పుస్తకం తెలుగు అనువాదానికి ముందు మాట రాస్తూ ఆయన  ప్రొ. సాయిబాబాను ఈవిధంగా  ప్రస్తుతించారు :

ప్రొఫెసర్‌ సాయిబాబా ఈ పుస్తకాన్ని అనువదించడం నాకు చాల సంతోషం.

1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతుల సమస్యపై జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కష్టజీవి సాయిబాబాతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను.

హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకోకుండా
దొరికిన నా పుస్తకం "డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌" తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో ఆయన చెప్పడం
నాకింకా గుర్తుంది.

 నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్‌ సెక్యూరిటీ జైలులో 1978లో
టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.

నా సాంస్కృతిక కార్యాచరణ వల్ల,
ముఖ్యంగా కెన్యాలోని కామిరితు గ్రామంలో రైతులు, కార్మికులు తమ భాషలో తమ పోరాటాల గురించి చెప్పే తమ సొంత నాటకరంగాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నానికి సహకరించినందువల్ల
నన్ను జైలులో పెట్టారు.

నా పుస్తకాల్లో మరొకదాన్ని అదే సాయిబాబా మహారాష్ట్ర లోని నాగపూర్‌ హైసెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

దుర్భరమైన జైలు పరిస్థితుల్లో అనువాదం చేయడం!
ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలు జీవితం గడుపుతున్నాడంటే
 నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తున్నది.

- గూగీ వా థియోంగో

పుస్తక ప్రతులకోసం :
మలుపు 
2-1-1/5, నల్లకుంట,
 హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com








Sunday 22 October 2017

దళిత మహిళ తొలి ఆత్మకథ - ఆదివారం ఆంద్ర జ్యోతిలో (22-10-2017) చందు తులసి సమీక్ష

దళిత మహిళ తొలి ఆత్మకథ

వర్ణ వ్యవస్థ సృష్టించిన అత్యంత హేయమైన దురాచారం అంటరానితనం కారణంగా తరతరాల పాటు దళితుల జీవితాలు అంధకారంలో మగ్గిపోయాయి.
ఆధునిక విద్య,దళిత ఉద్యమాలు తీసుకొచ్చిన చైతన్యంతో ఆ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఇప్పటికీ పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతంగా దళిత సాహిత్యాన్ని తీసుకొస్తున్నారు. బాబా అంబేద్కర్ నడిపిన దళిత ఉద్యమంలో తోలి తరం మహిళా కార్యకర్త బేబీ కాంబ్లీ.

ఆమె తన జీవిత కాలంలో మహారాష్ట్రలోని మహర్ల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తూ రాసిన నవల ఇది. జీవా అమూచ అనే పేరుతొ  మరాఠీ పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ  ఆత్మకథ ...  దళిత మహిళ కోణంలోంచి వివరిస్తుంది. తరతరాలుగా దాస్యం,  వేట్టిచాకిరిలో మగ్గిపోయిన మహార్లు ... పేదరికంలో అంత కన్నా రదృష్టకరమైన అంతరానితనంతో దుర్భరంగా జీవించిన వారు, అంబేద్కర్ అందించిన చైతన్యంతో ఉద్యమాలు చేసి ఆత్మగౌరవాన్ని సాధించడమే సంక్షిప్తంగా ఈ నవల సందేశం.
అటు అగ్ర వర్ణ దురహంకారంతో పాటూ, ఇటు దళిత సమాజంలోనూ మహిళలపై హింస, అణచివేత, పురుషాధిక్య భావజాలం, వివక్ష ... పేరుకుపోయిన తీరును కాంబ్లీ అత్యంత సహజంగా చిత్రించారు. అ రకంగా దీన్ని దళిత మహిళ దృక్కోణం లోంచి వచ్చిన మొదటి ఆత్మకథగా చెప్పుకోవచ్చు. ఒక సాధారణ దళిత మహిళ జీవితం ఆత్మకథగా రావడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. మరాఠా పత్రికలో వచ్చిన ఈ రచన తెలుగు లోకి రావడానికి నలభై ఏళ్ళు పట్టడం గమనార్హం .

- చందు తులసి
ఆదివారం ఆంధ్రజ్యోతి



Monday 2 October 2017

ఈ పుస్తకం చదువుతుంటే మనకు తెలియని మన చరిత్ర పేరిట తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహిళల అనుభవాలను గ్రంధస్థం చేసిన వైన గుర్తుకు వస్తుంది - కే.పీ అశోక్ కుమార్, నవ తెలంగాణా

ఈ పుస్తకం చదువుతుంటే
'మనకు తెలియని మన చరిత్ర' పేరిట తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహిళల అనుభవాలను
గ్రంధస్థం చేసిన వైన గుర్తుకు వస్తుంది
- కే.పీ అశోక్ కుమార్, నవ తెలంగాణా 02-10-2017


Sunday 24 September 2017

"ఈ యుద్ధం తో ఇక యుద్ధం అనేదాన్ని చంపేస్తాం !"

రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ రష్యాలో
మొత్తం 8 లక్షలకి పైగా అమ్మాయిలు యుద్ధ రంగంలో పనిచేసారు

'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' పుస్తకం పై
సాక్షి సాహిత్య పేజీలో సమీక్ష (25-9-2017)



Saturday 26 August 2017

వంద వసంతాల బోల్షివిక్‌ విప్లవం సందర్భంగా 'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' - అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు


యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం
మూలం : వార్స్‌ అన్‌వుమెన్లీ ఫేస్‌ , ఎస్‌. అలెక్సీయెవిచ్‌
అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

బైలోరష్యాకి చెందిన అలెక్సీయెవిచ్‌ స్వెత్లానా 1948లో జన్మించింది. 1967లో బైలోరష్యన్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయం లో చేరింది. 1972లో జర్నలిస్టు విభాగంనుంచి పట్టభద్రు రాలైంది. బైలోరష్యా రిపబ్లిక్‌ జిల్లా, తాలూకా పత్రికల్లో పనిచేసింది.

ఈమె సోవియట్‌ యూనియన్‌ రచయితల సంఘ సభ్యురాలు. ఈమె రచించిన ''యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం,'' ''ఆఖరి సాక్షి'' (యుద్ధం గురించి పిల్లల కథనాలు) అనే పుస్తకాలు విశేష ప్రాచుర్యం పొందాయి. ''యుద్ధం స్త్రీ ప్రకృతికి
విరుద్ధం''ను అనేక భాషల్లోకి అనువదించారు, డాక్యుమెంటరీ సినిమాలు తీశారు, నాటకాలుగా మలిచారు.

''యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం'' యుద్ధంలో పాల్గొన్న స్త్రీల కథనాలు.
అవి కథలూ, గాథలూ కావు, బాధాకరమైన భావోద్వేగాలు.

1941లో వధువులు కావాలని బంగరు కలలు గన్న బాలికలు ఎలా సైనికులయ్యారో యిందులోని కథనాలు చెప్తాయి. 20వ శతాబ్దిలో సంభవించిన అత్యంత దారుణమైన రెండవ ప్రపంచ యుద్ధంలో 8 లక్షల మందికి పైగా సోవియట్‌ మహిళలు పురుషులతో సరిదీటుగా పాల్గొన్నారు.

స్త్రీలు క్షతగాత్రులను రక్షించి, కట్లుకట్టడమే కాకుండా, కాల్పులు జరిపారు, వంతెనలు పేల్చారు, శత్రువుల ఆనుపానులు తెలుసుకొనేందుకు వేగు చర్యలు సాగించారు, తమ మాతృదేశం మీద, తమ ఇళ్లమీద, తమ బిడ్డలమీద కనీవినీ ఎరుగని క్రౌర్యంతో దాడిచేసిన శత్రువులను చంపారు.

రచయిత్రి యీ పుస్తక రచనకోసం నాలుగేళ్లు అవిరామంగా శ్రమించింది. నూటికి పైగా నగరాలు, పట్టణాలు, పల్ల్లెలు, జనావాసాలు పర్యటించి, యుద్ధంలో పాల్గొన్నవాళ్ల కథనాలు సేకరించింది. అయితే వాటిలో ముఖ్యమైనవి యుద్ధ రంగంలో జరిగిన ఘటనలు కావు, యుద్ధంలో స్త్రీల గుండెల్ని పిండివేసిన అనుభవాలు.

ఈ ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా గతం నుంచి వర్తమానం నేర్చుకోవలసిన గుణపాఠాల పైకీ, నాటి, నేటి ఫాసిజం పైకీ, యుద్ధాన్ని నివారించవలసిన అవసరం పైకీ పాఠకుల దృష్టి ఆకర్షిప బడింది.

- ప్రగతి ప్రచురణాలయం, సోవియట్‌ యూనియన్‌, 1988


వంద వసంతాల బోల్షివిక్‌ విప్లవం సందర్భంగా
'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' -

మూలం : వార్స్‌ అన్‌వుమెన్లీ ఫేస్‌ , ఎస్‌. అలెక్సీయెవిచ్‌

అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

మొదటి ముద్రణ : ప్రగతి ప్రచురణాలయం, సోవియట్‌ యూనియన్‌, 1988

 మలుపు ప్రచురణ : ఆగస్టు 2017

పేజీలు : 112
వెల : 100/-

ప్రతులకు:  
మలుపు 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com